Hyderabad, ఏప్రిల్ 8 -- అందమైన, మెరిసే చర్మం కావాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. బయటికి చెప్పుకోకపోయినా ఇది అందరి కల. కానీ కొద్దిమందికి మాత్రమే ఈ కోరిక నెరవేరుతుంది. చాలా మంది మహిళలు అందంగా, ఆకర్షనీయంగా కనిపించడం కోసం పార్లర్లలో ఖరీదైన ఫేషియల్స్ చేయించుకుంటారు. రకరకాల క్రీములు, లోషన్లు వాడతారు. కానీ కాంతివంతమైన మెరుపు పోందలేరు. మీరు కూడా సౌందర్య ప్రియులే అయితే చర్మం విషయంలో సహజమైన పద్ధతులు, పదార్థాలను ఎంచుకోవాలనుకుంటే ఫేషియల్ స్టీమింగ్ మీకు చాలా ాగా సహాయపడుతుంది.

షేషియల్ స్టీమింగ్ అంటే ముఖానికి ఆవిరి పట్టడం. ఇది ఎలాంటి డబ్బు ఖర్చు చేయకుండానే ఇంట్లోనే పార్లర్ లాంటి మెరుపు తీసుకొస్తుంది. చర్మాన్ని మెరిసేలా, ఆరోగ్యంగా ఉంచే సులభమైన, సహజమైన మార్గం ఇది. ముఖానికి ఆవిరి పట్టడం వల్ల చర్మం లోపలి నుండి శుభ్రపడుతుంది, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ద...