Hyderabad, జనవరి 5 -- అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా అందం మీద ఆడవారికి కాస్త దృష్టి ఎక్కువే. సౌందర్య ప్రియుల్లో చాలా మందికి అతి పెద్ద సమస్య అవాంఛిత రోమాలు. ముఖ్యంగా ముఖంపై వెంట్రుకలు పెరగడం వల్ల చాలా మహిళలు ఇబ్బంది పడుతున్నారు. వీటిని పొగొట్టుకునేందుకు పార్లర్‌లో వేలకు వేలు పెట్టి వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్, వంటి రకరకాల ట్రీట్‌మెంట్స్ తీసుకున్నా వీటికి పరిష్కారం తాత్కాలికంగానే ఉంటుంది. అసలు అవాంఛిత రోమాలకు పర్మినెంట్ సొల్యూషన్ ఏం లేదా? ఈ సమస్యను తగ్గించుకోవడానికి క్రీములు, వాక్సింగ్లు తప్ప వేరే మార్గం లేదా? అనుకునే వారు తెలుసుకోవాల్సిన ఒకటి ఉంది.

అవాంఛిత రోమాలకు కారణాలేంటి?

నిజానికి అవాంఛిత రోమాలు అనేవి పూర్తిగా హార్మోన్లకు సంబంధించినవి. వీటికి క్రీములు, ట్రీట్ మెంట్లు ఇవ్వని పరిష్కారం మీ జీవనశైలి, ఆహార...