Hyderabad, జనవరి 27 -- అందంగా ఉండాలని అందరూ ప్రయత్నిస్తారు. కానీ కాలుష్యం, పోషకాహారలోపం వల్ల ముఖం కాంతి విహీనంగా మారుతుంది. కొన్ని చోట్ల రంగు పాలిపోయినట్టు, మరోచోట రంగు ముదిరినట్టు ముఖం కనిపిస్తుంది. ఇలా ముఖం అసమాన స్కిన్ టోన్ కలిగి ఉండడం వల్ల అందంగా కనిపించరు. కాబట్టి మీ స్కిన్ టోన్ మొత్తం ఒకేలా ఉంటేనే అందంగా కనిపిస్తారు.

అసమాన స్కిన్ టోన్ ఒక సాధారణ సమస్యలా కనిపిస్తున్నా. ఇది అందాన్ని తగ్గిస్తుంది. ఇది ముఖ సౌందర్యాన్ని పాడు చేస్తుంది. ఈ సమస్యను తగ్గించేకోవడానికి ఇంట్లోనే ఫేస్ ప్యాక్ తయారుచేసుకోవచ్చు. అసమాన స్కిన్ టోన్ ను వదిలించుకునే సులభమైన ఫేస్ ప్యాక్ ను ఇక్కడ మేము చెబుతున్నాము.

ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలంటే ముందుగా బియ్యాన్ని నీళ్లలో వేసి బాగా ఉడికింాచలి. అన్నం ఉడికిన తర్వాత చల్లారనివ్వాలి. దాన్ని మిక్సీలో వేసి చిక్కటి పేస్ట్ లా ...