Hyderabad, మార్చి 8 -- మొఖంపై మచ్చలు, ముడతలు, చర్మంపై ఏ ఇతర సమస్యలున్నా ఫేస్ మాస్క్ అద్భుతమైన పరిష్కారం చూపిస్తుంది. కాకపోతే ఏది మంచిదో తెలుసుకోవడమే ముఖ్యం. చాలా వరకూ ఉపయోగకరంగా పనిచేసే ఫేస్ మాస్క్‌లన్నీ ఇంట్లో తయారుచేసుకున్నవే. ఫేస్ మాస్క్ అంటే అందుబాటులో ఉన్న ఏదో ఒక వస్తువుతో తయారుచేసుకునేది కాదు. మీ చర్మానికి సరిపోయేదిగా ఉండాలి. మీరు ఉపయోగించే ఫేస్ మాస్క్ మంచి ఫలితాలను కనబరిచేదిగా కూడా ఉండాలి.

ఉదాహరణకు, పసుపు, కలబంద, తేనె చర్మం మెరిసిపోయేలా చేయడానికి చాలా మంచివే. కానీ, పాలు, నిమ్మకాయ కలిపితే మాత్రం చర్మంపై ఇరిటేషన్ మొదలవుతుంది. ఇటువంటి పొరబాట్లు చేయకుండా ఫేస్ మాస్క్ చేసుకోవాలనుకుంటే ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి.

ఇంట్లో తయారుచేసిన ఫేస్ మాస్క్ లు సేఫ్టీపరంగానే కాదు, ఆరోగ్యానికి కూడా మంచివట. నిల్వ ఉండేందుకు, సువాసన వచ్చేందుకు కలిపే కెమి...