Hyderabad, మార్చి 23 -- చర్మకాంతిని కాపాడుకోవడానికి, వయస్సు పెరుగుతున్న కొద్దీ చర్మంపై ఏర్పడే వృద్ధాప్య ఛాయలు తగ్గించుకోవడానికి, చర్మ సంబంధిత సమస్యలను దూరంగా ఉంచుకోవడానికి సరైన చర్మ సంరక్షణను పాటించాలి. మీరు ఎటువంటి చర్మ సంరక్షణను పాటించకపోతే, కాలక్రమేణా బిగుతుగా ఉన్న చర్మం క్రమంగా వేలాడడం ప్రారంభిస్తుంది. అతి జాగ్రత్త తీసుకుని స్కిన్ ట్రీట్మెంట్స్ ఎక్కువగా తీసుకుంటే, మరో ప్రమాదముంది. ఎక్కువ కెమికల్స్ వాడటం వల్ల ముఖం మరింత అధ్వానంగా మారుతుంది. అలాంటప్పుడు 30 ఏళ్ల తర్వాత స్కిన్ టైటెనింగ్ ఫేస్ మాస్క్‌లు వేసుకోవడం ప్రారంభించాలి. ఈ మాస్కులను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా.

కీర దోసకాయల్లో ఉండే తేమ, యాంటీ ఏజింగ్ లక్షణాల కారణంగా అనేక చర్మ సంరక్షణ ప్రక్రియలకు చాలా బెస్ట్ ఆప్షన్. ఇందులో ఉండే విటమిన్ సి చర్మాన్ని మెరిసేలా చేసి ఫ్రీరాడ...