Hyderabad, ఫిబ్రవరి 15 -- మన దైనందిన జీవితంలో మన కళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. మంచి దృష్టిని కాపాడుకోవడానికి, దీర్ఘకాలిక సమస్యలను నివారించడానికి కంటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. మీరు మీ కంటిని మీరు ప్రత్యక్షంగా జాగ్రత్తగానే చూసుకుంటూ ఉండచ్చు. కానీ పరోక్షంగా మీకు తెలియకుండానే మీరే నాశనం చేస్తున్నారు కూడా. అవును.. ఇతర ఆరోగ్య సమస్యల పేరుతో మీరు ప్రతి రోజూ వేసుకునే రకరకాల మాత్రలు మీ కంటి ఆరోగ్యంపై చెడు ప్రభావం చేపుతాయని మీకు తెలుసా? మధుమేహం, బరువు తగ్గడం, రక్తపోటు, మానసిక ఆరోగ్య సమస్యలతో సహా ఇతర సమస్యలకు తీసుకునే అనేక మందులు కంటి ఆరోగ్యానికి ప్రతికూలంగా ఉంటాయి. వివరంగా తెలుసుకుందాం రండి..

మీరు బరువు తగ్గడానికి లేదా డయాబెటిస్ నియంత్రణ కోసం సెమాగ్లుటైడ్ లేదా టిర్జెపాటిడ్ మందులు తీసుకుంటుంటే, అది మీ దృష్టిపై ప్రతికూల ప్రభావాన్ని...