Hyderabad, మార్చి 26 -- ఎండ తాపం రోజురోజుకు పెరుగుతోంది. మార్చి నెలలోనే పరిస్థితి ఇలా ఉండే ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రతను తట్టుకోవడం చాలా కష్టంగా మారుతుంది. ఎండలు మండుతున్న సమయంలో చర్మారోగ్యం గురించి మాత్రమే కాకుండా కళ్ల గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే సూర్యుడి నుంచి విడుదల అయ్యే సూర్యకాంతి ప్రభావం నేరుగా కళ్ల మీద పడుతుంది. ఎండతో పాటు వేడి గాలి, దుమ్ము, కాలుష్యం కూడా కంటి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి.

తీవ్రమైన అతినీలలోహిత కిరణాలు, నిర్జలీకరణం, ఎక్కువ సమయం మొబైల్, ల్యాప్‌టాప్ చూడటం వల్ల కళ్ళు పొడిబారడం, చికాకు, అలసట వంటి సమస్యలు వేసవిలో ఎక్కువగా వస్తాయి. వీటిని తగ్గించడానికి కంటిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ సీజన్లో మీరు కంటి సంరక్షణ విషయంలో శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. సరళమైన, సహజ పరిష్కారాల ద్వారా వేసవ...