Hyderabad, జనవరి 26 -- ఆరోగ్యకరమైన జీవన విధానంలో ప్రధానమైనది వ్యాయామం. ఎంతటి హెల్తీ డైట్ పాటించినా ఫిజికల్ ఎక్సర్‌సైజ్ అనేది తప్పనిసరి. అందుకే ఆరోగ్యకరంగా ఉండాలనుకునే వారు రోజువారీ అలవాట్లలో వ్యాయామాన్ని భాగంగా చేసుకుంటారు. కానీ, వ్యాయామం చేసే సమయంలో ఏమేం చేయాలో, ఎలాంటివి చేయకూడదో కూడా తెలుసుకోవాలి. లేకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిల్లో ఒకటే ఈ వృద్ధాప్య సమస్య. మీరు చేసే వ్యాయామంలో ఈ కొన్ని పొరబాట్లు రిపీట్ అవడం వల్ల వయస్సు కంటే ముందుగానే వృద్ధులుగా కనిపిస్తారట. ఆ పొరబాట్లేంటో తెలుసుకుందామా..

మనలో చాలా మంది వ్యాయామం చేసేటప్పుడు ఏకధాటిగా శ్రమిస్తుంటాం. శరీరానికి విశ్రాంతి ఇవ్వడానికి ఇష్టపడం. కానీ, అలా చేయడం ముమ్మాటికి తప్పేనట. నిరంతరంగా వ్యాయామం చేయడం వల్ల శరీరంపై దుష్ప్రభవాలు చూపిస్తాయట. శరీరంలో దీర్ఘకాలిక వాపు (Chronic Inflamma...