భారతదేశం, ఫిబ్రవరి 28 -- Ex MP Vinod: దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లను తగ్గిస్తే దేశ విచ్చిన్నమేనని మాజీ ఎంపీ వినోద్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కరీంనగర్‌లో పట్టభద్రుల ఓటు హక్కు వినియోగించుకున్న వినోద్‌కుమార్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. దక్షిణ భారత దేశంలో జనాభా లెక్కల ప్రకారం పార్లమెంట్‌ సీట్లు తగ్గిస్తే ఎవ్వరు ఊరుకొరని చెప్పారు.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా చేసిన వాఖ్యల ప్రకారం చూస్తే సీట్లు తగ్గించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం లేదని అనుకోవల్సి వస్తోందన్నారు. ప్రస్తుత జనాభా ప్రాతిపదికన పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్విభజన చేపడితే ఉత్తరాదికంటే దక్షిణ భారతంలో సీట్లు తగ్గుతాయని తమిళనాడు సీఎం స్టాలిన్‌ చేసిన ప్రతిపాదనలో వాస్తవం ఉందన్నారు.

దీనిపై అఖిలపక్షాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారన్నారు...