భారతదేశం, జనవరి 26 -- Ex Mlc Satyanarayana : తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్ట్ ఆర్ సత్యనారాయణ (60) ఆదివారం తన నివాసంలో తుది శ్వాస విడిచారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణ, తన నివాసంలోనే ఈరోజు మరణించారని కుటుంబసభ్యులు తెలిపారు. మెదక్ జిల్లాకు చెందిన సత్యనారాయణ, డిగ్రీ చదువుతున్న సమయం 1980లో జర్నలిస్ట్ గా తన జీవితనాన్ని ప్రారంభించారు. సుమారుగా 25 సంవత్సరాలు జర్నలిస్ట్ గా పనిచేస్తూ, జిల్లాలో ఎన్నో సమస్యలను లేవనెత్తడంలో, వాటికీ పరిష్కరాల కోసం తనవంతు ప్రయత్నం చేశారు. తన జీవిత కాలంలో ఎంతో మంది యువ జర్నలిస్ట్ లను తయారుచేశారు.

2001లో మాజీ సీఎం కేసీఆర్ ప్రారంభించిన తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితుడై బీఆర్ఎస్ పార్టీ లో చేరిన సత్యనారాయణ, ఆ పార్టీ ఉమ్మడి జిల్లా అధక్షుడిగా పని చేసి పార్టీ పటిష్టత కోసం తీవ్ర కృషి చేశార...