Hyderabad, ఫిబ్రవరి 24 -- చాలా మందికి చర్మం సున్నితంగా ఉంటుంది. తరచూ వీరికి మొటిమలు అవుతుంటాయి. అయితే సాధారణ చర్మం కలిగిన వారికన్నా మొటిమల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు చర్మం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అంటే కేవలం చర్మపు ఉత్పత్తులు, ఆహారంలో మార్పులు మాత్రమే కాదండోయ్. రోజూవారీ అలవాట్ల విషయంలో కూడా శ్రద్దగా ఉండాలట. ఎందుకో ఎలాగో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

నిజానికి మొటిమలను నివారించడం చర్మ సంరక్షణ ఉత్పత్తులపై మాత్రమే కాకుండా, రోజువారీ అలవాట్లపై కూడా ఆధారపడి ఉంటుంది. అంతేకాదు రోజూ మీరు చేసే కొన్ని పనులు, అందులోనూ మంచి అలవాట్లు కూడా మొటిమల సమస్యను పెంచుతాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రముఖ చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ గారేకర్ ఇన్‌స్టాగ్రామ్‌లో మొటిమలతో ఉన్న చర్మం ఉన్నవారు నివారించాల్సిన మూడు సాధారణ తప్పులను పంచు...