Hyderabad, ఫిబ్రవరి 12 -- Evergreen Telugu Romantic Movies on OTT: క్లాసిక్, ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీస్ ఉన్న తెలుగు సినిమాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం ఇవి నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, యూట్యూబ్, జీ5, ఆహా వీడియోలాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో అందుబాటులో ఉన్నాయి. మీ వాలెంటైన్ తో కలిసి ఈ శుక్రవారం (ఫిబ్రవరి 14) వచ్చే వాలెంటైన్స్ డేనాడు చూడాల్సిన ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీస్ ఏంటో చూసేయండి.

వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఉన్న ఎవర్ గ్రీన్ తెలుగు లవ్ స్టోరీ మూవీస్ ఇవే.

36 ఏళ్ల కిందట వచ్చినా ఇప్పటికీ, ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల మనసులకు దగ్గరగా ఉండే మూవీ గీతాంజలి. నాగార్జున, గిరిజ నటించిన ఈ మూవీని మణిరత్నం డైరెక్ట్ చేయగా.. ఇళయరాజా అందించిన మ్యూజిక్ మరో హైలైట్. ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

మణిరత్నం డైరెక్ట్ చేసిన ఈ రోజా మూవీ తమిళంలో ని...