Hyderabad, ఫిబ్రవరి 17 -- ETV Win OTT: ఓటీటీ అంటే పెద్ద వాళ్లకే కాదు.. చిన్న పిల్లలకు కూడా. చాలా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఇప్పటికే పిల్లల కోసం ప్రత్యేకంగా షోలను తీసుకొచ్చాయి. తాజాగా ఈటీవీ విన్ ఓటీటీ కూడా కార్టూన్ షోలతో రాబోతోంది. ఫిబ్రవరి 27 నుంచి ఒకేసారి ఐదు కార్టూన్ షోలను ఆ ఓటీటీ అనౌన్స్ చేయడం విశేషం.

ఈటీవీ విన్ ఓటీటీ ఈ మధ్యకాలంలో వరుసగా ఒరిజినల్ మూవీస్, షోలతో దూసుకెళ్తోంది. ఎక్స్‌క్లూజివ్ గా తెలుగు కంటెంట్ కోసమే వచ్చిన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఒకటైన ఈటీవీ విన్.. ఇప్పుడు పిల్లల కోసం కూడా ప్రత్యేకంగా కార్టూన్లను తీసుకువస్తోంది. ఈ విషయాన్ని సోమవారం (ఫిబ్రవరి 17) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

ఫిబ్రవరి 27 నుంచి ఐదు సరికొత్త కార్టూన్ షోలను స్ట్రీమింగ్ చేయనుంది. అంతేకాదు వీటన్నింటి తొలి ఎపిసోడ్లను ఫ్రీగా చూసే అవకాశం కూడా కల్పించారు. "త్వరల...