భారతదేశం, జనవరి 26 -- ఢిల్లీల్లోని కర్తవ్యపథ్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా వివిధ రాష్ట్రాలు ప్రదర్శించిన శకటాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఏపీకి చెందిన ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీన్ని ప్రధాని మోదీ ఆసక్తిగా తిలకించారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఏటికొప్పాక బొమ్మలకు ఎంతో ఘన చరిత్ర ఉంది. మామూలు కర్రతో తయారు చేసే ఈ బొమ్మలకు ఎంతో డిమాండ్ ఉంటుంది. ఈ బొమ్మలు.. గణతంత్ర వేడుకల్లో శకటం రూపంలో దర్శనమివ్వడంపై ఏపీ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జీఐ ట్యాగ్‌ సంపాదించిన ఈ బొమ్మలను.. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో తయారు చేస్తారు. గత 400 ఏళ్లగా ఇక్కడ వీటిని తయారు చేయడం గమనార్హం. వంట చేసేందుకు కూడా పనికిరాని అంకుడు కర్రతో.. ఇక్కడి ప్రజలు అద్భుతాలు సృష్టిస్త...