భారతదేశం, జనవరి 29 -- Etikoppaka Sakatam : దిల్లీలో కర్తవ్యపథ్ లో జ‌రిగిన 76వ గ‌ణ‌తంత్ర దినోత్సవం పరేడ్‌లో ప్రదర్శించిన శ‌క‌టాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శ‌క‌టానికి కేంద్ర ప్రభుత్వం జ్యూరీ అవార్డు ప్రకటించింది. ఏపీలోని చేతి వృత్తుల ప్రాముఖ్యత చాటుతూ, రాష్ట్ర వార‌స‌త్వ సంప్రదాయానికి ప్రతీకగా ఉన్న ఏటికొప్పాక బొమ్మలతో రూపొందించిన శ‌క‌టాన్ని రిప‌బ్లిక్ డే పరేడ్ ఉత్సవంలో హైలెట్‌గా నిలిచింది.

ఏపీ శకటం యావ‌త్ దేశ ప్రజలందరి దృష్టిని ఆక‌ర్షించింది. సామాజిక మాధ్యమాలలో లక్షలాది మంది ఈ శ‌క‌టానికి మంత్రముగ్దులై ప్రశంస‌ల‌తో ముంచెత్తారు. రాష్ట్రంలో చేతివృత్తులు, హస్తకళలకు జాతీయ స్థాయిలో, అంత‌ర్జాతీయ స్థాయిలో విస్తృత ప్రచారం తీసుకురావాల‌నే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఆలోచ‌న‌ల‌తో రాష్ట్ర స‌మాచార పౌర సంబంధాల శాఖ ఈ శ‌క‌టాన్ని రూపొందించింది.

శ‌క‌టం ముందు వినాయ...