భారతదేశం, జనవరి 29 -- Ethanol price hike: చక్కెర ఉప ఉత్పత్తి అయిన ఇథనాల్ ధరల పెంపునకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇథనాల్ ను ప్రభుత్వ రంగ పెట్రోల్ రిటైలర్లు చెరకు మిల్లర్ల నుంచి కొనుగోలు చేస్తారు. విదేశీ పెట్రోలియం కొనుగోళ్లపై భారత్ ఆధారపడటాన్ని తగ్గించడం మోడీ ప్రభుత్వ ఇంధన-బ్లెండింగ్ కార్యక్రమం లక్ష్యం.

ఇథనాల్ సరఫరాకు సంబంధించి 2024-25 సంవత్సరానికి (నవంబర్ 1, 2024 నుండి అక్టోబర్ 31, 2025 వరకు) ఇథనాల్ ధరను లీటరుకు రూ .57.97 గా నిర్ణయించారు. ఇది గతంలో లీటరుకు రూ .56.58గా ఉండేది. అంటే, 2.5% పెంపునకు కేంద్రం ఆమోదం తెలిపింది. చెరకు క్రషింగ్ లో ఉప ఉత్పత్తి అయిన మొలాసిస్ నుండి ఇథనాల్ ను ఉత్పత్తి చేస్తారు. ఇథనాల్ బ్లెండింగ్ కారణంగా గత పదేళ్లలో (2014-15 నుంచి 2023-24 వరకు) విదేశీ మారకద్రవ్యం 1...