తెలంగాణ,జనగామ, ఫిబ్రవరి 13 -- సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించేందుకు కుట్ర జరుగుతోందని. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారని వ్యాఖ్యానించారు. ఇది సర్కార్ కూలిపోడానికి మొదటి సంకేతమన్నారు.

ఓటమి భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలను వాయిదా వేసే పరిస్థితికి వచ్చిందని ఎర్రబెల్లి దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు చేసే పనులకు ఏ మాత్రం సంబంధం లేదన్నారు. రాహుల్ గాంధీ కూడా టైమ్ ఇచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ పాలన గురించి తెలిసే రాహుల్ గాంధీ వరంగల్ టూర్ రద్దైందని కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధాలమయమని. స్థానిక ఎన్నిక...