భారతదేశం, మార్చి 6 -- సభ్యుల ప్రొఫైల్ అప్డేట్ కోసం నిబంధనలను సవరించింది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ). తాజా సవరణతో, ఈపీఎఫ్ సభ్యులు డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సిన అవసరం లేకుండానే వ్యక్తిగత వివరాలతో ఆధార్ లింక్డ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్లను (యూఏఎన్) అప్డేట్ చేసుకోవచ్చు.

ఆధార్ ద్వారా యూఏఎన్ చెల్లుబాటు అయితే ఈపీఎఫ్ సభ్యులు పేరు, పుట్టిన తేదీ, లింగం, జాతీయత, తండ్రి లేదా తల్లి పేరు, వైవాహిక స్థితి, జీవిత భాగస్వామి పేరు, ఉద్యోగంలో చేరిన తేదీ- విడిచిపెట్టిన తేదీ వంటి వ్యక్తిగత సమాచారంతో తమ ప్రొఫైల్స్​ని అప్డేట్ చేసుకోవచ్చు.

ఇంతకు ముందు, సభ్యులు తమ ప్రొఫైల్స్​ని అప్డేట్ చేయడానికి వారి యజమాని నుంచి అనుమతి అవసరం పొందాల్సి ఉండేది. ఇది సగటున దాదాపు 28 రోజులు ఆలస్యానికి కారణమయ్యేది.

"2024-25 ఆర్థిక సంవత్సరంలో యజమానుల ద్వారా దిద్...