భారతదేశం, ఏప్రిల్ 18 -- EPFO withdrawal Limit increase: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రస్తుతం ఉన్న 68జే క్లెయిమ్ ల అర్హత పరిమితిని రూ.50,000 నుంచి రూ.లక్షకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. విత్ డ్రాయల్ అర్హత పరిమితిని రూ.50,000 నుంచి రూ.లక్షకు పెంచడానికి సంబంధించి ఈ ఏప్రిల్ 10వ తేదీన అప్లికేషన్ సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసింది. ఈ నిబంధన మార్పుకు సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఆమోదం లభించిందని తెలిపింది.

ఈపీఎఫ్ (EPFO) పాక్షిక ఉపసంహరణను ఫారం 31 ద్వారా అనేక ప్రయోజనాల కోసం అనుమతిస్తారు. వివాహ ఖర్చులు, రుణాలు చెల్లించడం, ఫ్లాట్ కొనుగోలు, ఇంటి నిర్మాణం.. మొదలైన అవసరాలకు, నిబంధనలకు లోబడి, ఈపీఎఫ్ నుంచి నగదును పాక్షికంగా ఉపసంహరించుకోవచ్చు. తాజాగా, 68 జే కింద ఉపసంహరణ పరిమితిని పెంచారు. ఎంప్లాయ...