భారతదేశం, ఫిబ్రవరి 25 -- Entrepreneur Training : మీరు పారిశ్రామిక వేత్త కావాల‌నుకుంటున్నారా? అయితే ఆల‌స్యం ఎందుకు ఉచిత శిక్షణ‌కు వెళ్లండి. ఈ అవ‌కాశాన్ని యువ‌తీ, యువ‌కులు వ‌దులుకోకుండా ఉప‌యోగించుకోండి. ఫిబ్రవ‌రి 28 నుంచి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల‌కు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ర్యాంపు ప‌థ‌కం కింద నిర్వహిస్తున్న ఈ శిక్షణ‌ యువ‌త‌ను పారిశ్రామిక వేత్తలుగా ఎదుగేందుకు ప్రోత్సహించేందుకు ఉద్దేశించింద‌ని అధికారులు చెబుతున్నారు.

నిరుద్యోగ యువ‌తీ, యువ‌కుల‌ను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించ‌నున్నట్లు ప్రకాశం జిల్లా ప‌రిశ్రమ‌ల కేంద్రం జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ బి. శ్రీ‌నివాసులు తెలిపారు. యువ‌తీ, యువ‌కులను పారిశ్రామిక‌వేత్తలుగా అభివృద్ధి చేయ‌టానికి ర్యాంపు ప‌థకం ద్వారా ఎంట‌ర్ ప్రెన్యూర్ షిప్ క‌మ్ స్కిల్ డెవ‌ల‌ప్‌మెం...