భారతదేశం, మార్చి 21 -- Employees Dues: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని ప్రకటించిన ప్రభుత్వం శుక్రవారం రూ.6,200 కోట్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని ఆర్థికశాఖను ముఖ్య మంత్రి చంద్రబాబు ఆదేశించడంతో సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఏఐ కింద కలిపి రూ. 6,200 కోట్లను శుక్రవారం విడుదల చేయనున్నారు. ఇందుకు అవసరమైనచర్యలు తీసుకుంటున్నారు.

ఈ ఏడాది జనవరి 11న ఉద్యోగులకు బకాయిల కింద రూ.1,033 కోట్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

గత ప్రభుత్వంలో ఉద్యోగ ఉపాధ్యాయులు వేతనాల చెల్లింపుల్లో ఇబ్బంది పడ్డారని, 25 వేల కోట్ల రూపాయల బకాయిలు ప...