భారతదేశం, ఫిబ్రవరి 8 -- ఏలూరు రైల్వే స్టేషన్ దశాబ్దాల కిందట ఏర్పాటైంది. కానీ.. అభివృద్ధికి మాత్రం నోచుకోలేదు. ఫలితంగా సమస్యలకు నిలయంగా పేరు సంపాదించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో.. ఏలూరు రైల్వే స్టేషన్ కొత్త రూపు సంతరించుకుంటోంది. దీనికి సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి. అభివృద్ధి పనులపై అటు రైల్వే శాఖ ఉన్నతాధికారులు, ఇటు ప్రజా ప్రతినిధులు ఫోకస్ పెట్టారు.

ఎంపిక చేసిన రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులను ఏడాది కిందట చేపట్టారు. దీంట్లో భాగంగా.. ఏలూరు స్టేషన్‌ ఆధునికీకరణ పనులను గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రారంభించారు. ఏలూరు రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులకు కేంద్రం రూ.21 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో తొలి విడతగా స్టేషన్‌లో సదుపాయాల కల్పన, నిర్ణీత నమూనాలో ఎలివేషన్‌ పనులు చేస్తున్నారు. దీంతోపాటు ప్లాట్‌ఫాంలు ఆధునికీకరిస్తున్...