భారతదేశం, మార్చి 31 -- Eluru Jail: ఏలూరు జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న మహిళ బ్యార‌క్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. భ‌ర్తను హ‌త్య చేసిన కేసులో మార్చి 24న నిందితురాలు అరెస్ట్ అయింది. ఈ కేసులో ఆమెతో పాటు మేన‌మామ సొంగ గోపాల‌రావుని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారిద్ద‌రినీ అదే రోజు న్యాయస్థానంలో హాజ‌రుప‌రిచారు. దీంతో న్యాయ‌మూర్తి రిమాండ్ విధించారు.

దీంతో ఆమెను ఏలూరు జిల్లా జైల్లోని మ‌హిళ బ్యార‌క్‌లో ఉంచారు. ఆమె ఆరుగురితో క‌లిసి మ‌హిళా బ్యారక్‌లో ఉంటుంది. ఆదివారం ఉద‌యం 6 గంట‌ల‌కు బ్యార‌క్ ఓపెన్ చేయగా శాంత‌కుమారి బాత్ రూముకు వెళ్లి వ‌స్తాన‌ని మిగిలిన ఖైదీల‌కు చెప్పి బ్యార‌క్‌లోకి వెళ్లింది. ఉద‌యం టిఫిన్ చేయడానికి ఎంత సేప‌టికి రాక‌పోవ‌డంతో తోటీ ఖైదీలు వెళ్లి చూస్తే బ్యార‌క్ కిటికీకి చున్నీతో ఉరేసుకుని క‌నిపించింది.

వె...