భారతదేశం, ఫిబ్రవరి 2 -- అభం శుభం తెలియని ఆ బాలుడి పాలిట.. అతడు కర్కశంగా వ్యవహరించాడు. విచక్షణ మరిచి దాష్టీకం ప్రదర్శించడంతో.. ఆ బాలుడు విలవిల్లాడిపోయాడు. ఏలూరు జిల్లా తాటిచర్లకు చెందిన శశి అనే మహిళ.. భర్తతో విభేదాల కారణంగా విడిగా ఉంటోంది. ఆమెకు కుమారుడు ఉదయ్ రాహుల్, కుమార్తె రేణుక ఉన్నారు.

జంగారెడ్డిగూడేనికి చెందిన పవన్ అనే వ్యక్తితో శశి ఏడాదికాలంగా సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో పవన్ నిత్యం చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, శనివారం రాత్రి ఫోన్ ఛార్జర్ కేబుల్‌తో కొట్టాడని బాలుడు బోరున విలపించాడు. బాలుడికి అయిన గాయాలను గుర్తించిన స్థానికులు.. ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్చారు. బాలుడి ఒంటి నిండా గాయాలను చూసి వైద్యులు, సిబ్బంది నిర్ఘాంతపోయారు.

ఉదయ్ చెల్లి రేణుకను సైతం స్థానికులు ఆస్పత్రికి తీసుకురాగా.. ఆమె శరీరంపైనా కాలిన గాట్లు, వాతలను వైద్యులు గ...