భారతదేశం, మార్చి 24 -- Eluru Crime : ఏలూరు జిల్లాలో ఘోర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో బాలిక‌పై యువ‌కుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా అత్యాచారానికి సంబంధించిన వీడియోలున్నాయంటూ బెదిరించి అత‌డి ఇద్దరు స్నేహితులు కూడా ఆ బాలిక‌పై అఘాయిత్యానికి ఒడిగ‌ట్టారు. విష‌యం తెలుసుకున్న బాలిక త‌ల్లిదండ్రులు ప్రశ్నిస్తే, వారిని కూడా బెదిరించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ముగ్గురు నిందితులు, వారితో సంబంధమున్న నలుగురిపై పోక్సో కేసు న‌మోదు చేశారు.

ఈ ఘ‌ట‌న ఏలూరు జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న ఏలూరు మూడో ప‌ట్టణ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఆదివారం వెలుగులోకి వ‌చ్చింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం ఏలూరులోని జేపీ న‌గ‌ర్‌కు చెందిన ఆళ్ల వంశీకృష్ణ అనే యువ‌కుడు, ఏలూరులోని ఒక ప్రాంతానికి చెందిన‌ ఓ బాలిక వెంట‌ప‌డ్డాడు. ప్...