భారతదేశం, ఫిబ్రవరి 18 -- Eluru Crime : ఏలూరు జిల్లా నిడమర్రు మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడి కుడి చేయి నరికి అతిదారుణంగా హత్య చేశారు. గ్రామానికి చెందిన యువకుడు మజ్జి ఏసు రాజు(26)ను శనివారం రాత్రి దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏసు తండ్రి ప్రసాద్‌ మరణించగా... తల్లి ప్రస్తుతం దుబాయ్‌లో ఉపాధికి వెళ్లారు. ఏసు, దుర్గా శ్రీవల్లిని 2023లో ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఏసు ఉండి మండలంలోని కలిగొట్ల గ్రామంలోని రొయ్యల చెరువుల కాపలాదారుడిగా పనిచేస్తున్నాడు.

ఏసు భార్యకు ఎనిమిదో నెల కావడంతో తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఏసుతో పాటు అతడి అమ్మమ్మ మాత్రమే ఉంది. శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఏసును బావాయిపాలెం శివారులోని చినకాపవరం పంటకాల్వ వద్ద హత్య చేసి, మృతదేహాన్న కాల్వ రేవు వద్ద పడేశార...