ఆంధ్రప్రదేశ్,ఏలూరు జిల్లా, మార్చి 29 -- ఏలూరు జిల్లాలో ఘోర‌ం వెలుగు చూసింది. వివాహేత‌ర సంబంధం నేప‌థ్యంలో ఓ వివాహితకు ప్రియుడు బ‌ల‌వంతంగా క‌లుపు మందును తాగించాడు. దీంతో ఆమె మృతి చెందింది. పోలీసులు కేసు న‌మోదు చేసి విచార‌ణ జ‌రుపుతున్నారు.

ఈ ఘట‌న ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండ‌లం పేరంపేట‌లో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. 2014లో కొయ్య‌ల‌గూడెం మండ‌లం య‌ర్రంపేట‌కు చెందిన వ్య‌క్తితో జంగారెడ్డిగూడెం మండ‌లం పేరంపేట‌కు చెందిన మ‌హిళ (31)కి వివాహం జ‌రిగింది. వీరికి ఒక పాప కూడా ఉంది.

గ‌త మూడేళ్లుగా కొయ్య‌ల‌గూడెం మండ‌లం గంగ‌న్న‌గూడేనికి చెందిన మోదుగ పెద్ద‌సాయి అనే యువ‌కుడికి వివాహిత ప‌రిచయం అయింది. వివాహిత‌ను ప్రేమిస్తున్నాన‌ని. పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి ద‌గ్గ‌ర‌య్యాడు.

దీంతో వారిద్ద‌రి మ‌ధ్య వివాహేత‌ర సంబంధం ...