భారతదేశం, మార్చి 25 -- ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండ‌లం తాటియాకుల‌గూడెంలో దారుణం జరిగింది. ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. తాటియాకులగూడెంలో గంధం బోసుబాబు, శాంతకుమారి దంప‌తులు నివ‌సిస్తున్నారు. భార్య శాంతకుమారికి పెళ్లికి ముందు నుంచే వ‌రుస‌కు మేన‌మామ అయిన తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట మండ‌లం పేరాయిగూడెనికి చెందిన సొంగ గోపాల‌రావుతో సంబంధం ఉండేది. భ‌ర్త బోసుబాబు సైతం మ‌రో మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో భార్య‌ను త‌ర‌చూ బోసుబాబు వేధించేవాడు. తీవ్ర మ‌న‌స్తాప‌ం చెందిన భార్య.. భ‌ర్త‌ను ఎలాగైనా అంత‌మొందించాల‌ని నిర్ణ‌యించుకుంది.

త‌న భ‌ర్త‌తో జీవించ‌లేన‌ని, వేధింపులు పెరిగాయ‌ని ప్రియుడు గోపాల‌రావుతో శాంత‌కుమారి చెప్పింది. భ‌ర్త అడ్డు తొల‌గించుకుంటే ఇద్ద‌రం క‌లిసి ఉండొచ...