భారతదేశం, ఫిబ్రవరి 17 -- Eluru Crime: ఏలూరు జిల్లాలో హేయమైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. బాలిక‌పై వ‌రుస‌కు అన్న‌లైన ఇద్ద‌రు యువ‌కులు మ‌ద్యం, గంజాయి మ‌త్తులో అత్యాచారానికి య‌త్నించారు. ఇంట‌ర్మీడియ‌ట్ చ‌దువుతున్న బాలిక కాలేజీ నుంచి ఇంటికి వ‌చ్చిన స‌మ‌యంలో ఆమెను వెంబ‌డించి, మాయ మాట‌లు చెప్పి ద్విచక్ర వాహ‌నంపై ఎత్తుకెళ్లి అఘాయిత్యానికి య‌త్నించారు. అయితే అతి క‌ష్టం మీద బాలిక ఆ దుర్మార్గుల చెర నుంచి త‌ప్పించుకుని బ‌య‌ట‌ప‌డింది. కుటుంబ స‌భ్యుల ఫిర్యాదుతో నిందితుల‌పై పోక్సో కేసు న‌మోదు చేశారు.

ఈ ఘ‌ట‌న ఏలూరు జిల్లా నూజివీడులో శ‌నివారం సాయంత్రం చోటు చేసుకున్న ఘ‌ట‌న ఆల‌స్యంగా ఆదివారం వెలుగులోకి వ‌చ్చింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం నూజివీడులోని ఒక ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీలో ఒక బాలిక ఇంటర్మీడియ‌ట్ చ‌దువుతోంది. ఆమెకు అన్న వ‌రుస అయ్యే పాటిబండ్ల సం...