భారతదేశం, ఫిబ్రవరి 25 -- Elephants Attack: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిల ఐదుగురుగు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. గుండాల కోన అటవీ ప్రాంతంలో ఏనుగుల భక్తులపై దాడి చేశాయి. ఈ ఘటనలో గాయపడిన వారు సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఓబులవారిపల్లె మండలం గుండాల కోనలో ఉన్న శివాలయానికి శివరాత్రి సందర్భంగా భక్తులు తరలి వెళుతుంటారు. సోమవారం రాత్రి 14మంది భక్తుల బృందం గుండాలకోనకు అటవీ మార్గంలో కాలినడకన వెళ్లారు. ఈ క్రమంలో ఏనుగుల మంద భక్తులపై దాడి చేశాయి.

శివరాత్రి సందర్భంగా వై కోటకు చెందిన భక్తులు గుండాల కోన ఆలయానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. అటవీ ప్రాంతంలో ఉన్న ఆలయానికి సమీపంలోనే భక్తులపై ఏనుగులు దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఏనుగుల దాడిలో గాయపడిన వారిలో ఇద్దరిని త...