భారతదేశం, ఫిబ్రవరి 25 -- Elephants Attack: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిల ఐదుగురుగు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. గుండాల కోన అటవీ ప్రాంతంలో ఏనుగుల భక్తులపై దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారు సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఓబులవారిపల్లె మండలం గుండాల కోనలో ఉన్న శివాలయానికి శివరాత్రి సందర్భంగా భక్తులు తరలి వెళుతుంటారు. ఈ క్రమంలో ఏనుగుల మంద భక్తులపై దాడి చేశాయి.

శివరాత్రి సందర్భంగా వై కోటకు చెందిన భక్తులు గుండాల కోన ఆలయానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. అటవీ ప్రాంతంలో ఉన్న ఆలయానికి సమీపంలోనే భక్తులపై ఏనుగులు దాడి చేశాయి. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు కూడా ఏనుగుల దాడిలో గాయపడినట్టు తెలుస్తోంది.

మృతి చెందిన వారిని రైల్వే కోడూరు మండలం ఉర్లగడ్డపాడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఏపీలోని ర...