భారతదేశం, ఫిబ్రవరి 24 -- Electricity Charges: దొడ్డిదారిన విద్యుత్ భారాలు మోపుతూ విద్యుత్ టారిఫ్ పెంచలేదనటం మోసపూరితమని సీపీఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. చిరు వ్యాపారులపై గంటకొక రేటు పెట్టి నడ్డి విరచడం శోచనీయమని, విద్యుత్ సర్దుబాటు చార్జీలు రద్దుచేసి కూటమి సర్కార్ మాట నిలబెట్టుకోవాలని సీపీఎం పార్టీ రాష్ట్ర నాయకుడు బాబురావు డిమాండ్ చేశారు.

ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ ముహమ్మద్ పేట గ్రామంలో ఇంటింటికి తిరిగి విద్యుత్ బిల్లులను పరిశీలించారు. చిరు వ్యాపారం చేసేవారితో సీపీఎం నేతలు మాట్లాడారు. ఇటీవల విద్యుత్ బిల్లులు మరింత పెరిగాయని ప్రజలు గగ్గోలు పెట్టారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....