భారతదేశం, ఫిబ్రవరి 1 -- బడ్జెట్‌ 2025లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీకి అవసరమైన కీలకమైన ఖనిజాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని(BCD) తగ్గించాలని నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఈ నిర్ణయంతో ఎలక్ట్రిక్ వాహనాలను మరింత తక్కువ ధరకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను పెంచాలని ప్రభుత్వం చూస్తోంది.

ఎలక్ట్రిక్ వాహనాల దేశీయ తయారీని ప్రోత్సహించడానికి.. కోబాల్ట్ పౌడర్, లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాలు, స్క్రాప్, సీసం, జింక్.., పన్నెండు ఇతర కీలకమైన ఖనిజాలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ నుండి పూర్తి మినహాయింపుతో సహా పన్ను ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టారు.

అవసరమైన బ్యాటరీ ఉత్పత్తి పరికరాలపై దిగుమతి సుంకాలను తగ్గించాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఈవీ ...