భారతదేశం, ఏప్రిల్ 11 -- ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్న దిల్లీ వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వం కీలక సంస్కరణలకు సిద్ధపడుతోంది. ఈవీ పాలసీ 2.0ని ప్రవేశపెట్టి.. ఇక పెట్రోల్​, డీజిల్​, సీఎన్జీ ఆధారిత 2 వీలర్స్​కి గుడ్​బై చెప్పాలని, కేవలం ఎలక్ట్రిక్​ స్కూటర్లనే విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 2026 ఆగస్ట్​ 15 నాటికి ఎలక్ట్రిక్​ స్కూటర్లు మినహా ఇతర వాహనాల రిజిస్ట్రేషన్లను నిలిపివేసే విధంగా ఈవీ పాలసీ 2.0లో నిబంధనలను రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే, ఈవీ అడాప్షన్​తో పాటు నగరంలో వాహనాల ద్వారా ఉత్పన్నమవుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు దిల్లీ ప్రభుత్వం తీసుకున్నట్టు అతిపెద్ద నిర్ణయం ఇదే అవుతుంది.

దిల్లీ ఎలక్ట్రిక్​ వెహికిల్​ పాలసీ 2.0కి ఇంకా ప్రభుత్వ కేబినెట్​ ఆమోదం దక్కాల్సి ఉంది. కాగా ఇందుకు సంబం...