భారతదేశం, ఫిబ్రవరి 24 -- Electric Vehicles: ఎలక్ట్రిక్‌ వాహనం కొన్న వినియోగదారుడికి దాని పనితీరుతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. హామీ మేరకు బ్యాటరీ పనిచేయకపోవడం, సరైన సామర్ధ్యాన్ని ప్రదర్శించక పోవడంతో వినియోగదారుడు కమిషన్‌ను ఆశ్రయించాడు. అక్కడ ఆరోపణల్ని రుజువు చేయలేకపోవడంతో నష్టపోవాల్సి వచ్చింది. ఫిర్యాదులు, అభ్యర్థనలకు సంబంధించిన రాత పూర్వక ఆధారాలను చూపలేక పోవడంతో ఫిర్యాదును కమిషన్ తిరస్కరించింది.

గుంటూరుకు చెందిన వాకా ప్రతాప్‌ రెడ్డి విజయవాడలో ఉన్నఎలక్ట్రిక్ స్టార్టప్‌ ప్యూర్ ఈవీ సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ వాహనం పనితీరుపై వినియోగదారుల రక్షణ చట్టం 2019 సెక్షన్ 35 ప్రకారం ఫోరంను ఆశ్రయించాడు. తనకు జరిగిన అన్యాయంపై ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడంతో పాటు విచారణ జరపాలన కమిషన్‌ అభ్యర్థించారు. ప్రతివాదులు రూ.45క్లెయిమ్‌ చెల్లించడంతో పాటు 12శాతం ...