భారతదేశం, మార్చి 31 -- కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్నారా? మీ కోసం అనేక ఆప్షన్స్ ఉన్నాయి. బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్, ఓలా ఎస్1 ఎక్స్, ఏథర్ రిజ్టా, హీరో విడా వీ2, అల్ట్రావయెలెట్ టెస్రాక్ట్, యాక్టివా ఈవీ ఉన్నాయి. వాటి ధర, లక్షణాల గురించి తెలుసుకుందాం.

టీవీఎస్ ఐక్యూబ్ కూడా ఒక ప్రసిద్ధ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది వివిధ రకాల వేరియంట్లలో లభిస్తుంది. 2.2 kWh బ్యాటరీ కలిగిన దీని మోడల్ ధర రూ. 1.07 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 75 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కేవలం 2 గంటల్లోనే 0 నుండి 80శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఇందులో 5-అంగుళాల టీఎఫ్‌టీ స్క్రీన్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, వెహికల్ క్రాష్-టో అలర్ట్ వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి. ఇది వాల్‌నట్ బ్రౌన్, పెర్ల్ వైట్ రంగులలో వస్తుంది.

బజాజ్ చేతక్ ఈ స్కూటర్ అనేక రూపాల్లో కొను...