భారతదేశం, జనవరి 28 -- ఎలక్ట్రిక్​ 2 వీలర్​ సెగ్మెంట్​లో ఆటోమొబైల్​ సంస్థల మధ్య నెలకొన్న తీవ్ర పోటీ కారణంగా వినియోగదారులకు మంచి జరుగుతోంది! లాంగ్​ రేంజ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్లు ఇప్పుడు తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఇలాంటి ఈ-స్కూటర్స్​లో ఒకటి కొమాకి ఎంజీ ప్రో! ఇది ఎంజీ ప్రో లిథియం సిరీస్​ పేరుతో అందుబాటులో ఉంది. సింగిల్​ ఛార్జ్​తో 150 కి.మీ రేంజ్​ని ఇచ్చే ఈ కొమాకి ఎంజీ ప్రో ఎలక్ట్రిక్​ స్కూటర్​ ధర, ఐఫోన్​ 16 ప్రైజ్​ కన్నా తక్కువే! ఈ నేపథ్యంలో ఈ వెహికిల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

కొమాకి ఎంజీ ప్రో ఎలక్ట్రిక్​ స్కూటర్​ లిథియం సిరీస్​లో మూడు వేరియంట్లు ఉన్నాయి. ఎంజీ ప్రో ఎల్​ఐ, ఎంజీ ప్రో వీ, ఎంజీ ప్రో +. తక్కువ-స్పీడ్ ఎల్​ఐ వేరియంట్ 1.75 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్​ని పొందుతుంది. ఇది 75 కిలోమీటర్ల (క్లెయిమ్) రేంజ్​ని ఇస్తుంది....