భారతదేశం, మార్చి 29 -- ఇండియాలో కొత్త కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. వీటితో కస్టమర్స్​కి మంచి ఆప్షన్స్​ లభిస్తున్నాయి. మరి మీరు కూడా ఒక ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే మీరు కొమాకి ఎక్స్​3 ఈ-స్కూటర్​ గురించి తెలుసుకోవాల్సిందే. సింగిల్​ ఛార్జ్​తో 100 కి.మీ వరకు రేంజ్​ని ఇచ్చే ఈ మోడల్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

కొమాకి ఎలక్ట్రిక్ వెహికల్ నుంచి ఎక్స్​ 3 ఈ-స్కూటర్​ ఇటీవలే మార్కెట్​లో అడుగుపెట్టింది. ఈ ఎక్స్3 భారతదేశం అంతటా అధీకృత డీలర్​షిప్స్​లో, ఈ-కామర్స్ ప్లాట్​ఫామ్స్​లో లభిస్తుందని కోమాకి పేర్కొంది.

కోమాకి ఎక్స్3 ఈ-స్కూటర్​ ప్రాక్టికల్ డిజైన్​తో వస్తుంది. ఇందులో డ్యూయెల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లతో కూడిన ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్​ ఇందులో అందించారు. కోమాకి ఎక్స్3 ఎలక్ట్రిక...