భారతదేశం, సెప్టెంబర్ 10 -- భారత మార్కెట్లోకి వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ అడుగుపెట్టింది. కంపెనీ తన తొలి మోడల్‌గా కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విన్‌ఫాస్ట్ వీఎఫ్​6 ను విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 16.49 లక్షల నుంచి రూ. 18.29 లక్షల మధ్య ఉంది. తమిళనాడులోని ప్లాంట్‌లో తయారీ, పూర్తిస్థాయి ఎకోసిస్టమ్ ఏర్పాటు వంటి హామీలతో ఈ లాంచ్ కొత్త ఉత్పత్తికి మించినదిగా కనిపిస్తోంది. ఇది భారత మార్కెట్‌లో బలమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలన్న విన్‌ఫాస్ట్ ఉద్దేశాన్ని స్పష్టం చేస్తోంది. ప్రీమియం ఫీచర్లతో ఎలక్ట్రిక్​ కారు కావాలనుకునే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ మోడల్​ని విడుదల చేశారు.

ఈ సెగ్మెంట్‌లో ఇప్పటికే ఎంజీ విండ్సర్ ఈవీ తన స్థానాన్ని పదిలపరుచుకుంది. బేస్ ఎక్సైట్ మోడల్ రూ. 13.99 లక్షల నుంచి, టాప్ ట్రిమ్ రూ. 17.49...