భారతదేశం, ఫిబ్రవరి 6 -- భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు భారీ పెరుగుదలను చూస్తున్నాయి. ప్రస్తుతం జనవరి 2025లో ఈవీ అమ్మకాల లిస్టులో టాటా, మహీంద్రా, ఎంజీ మోటార్ ముందున్నాయి. ప్రారంభం నుండి టాటా ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో అగ్రగామిగా కొనసాగుతోంది. కానీ ఇప్పుడు ఎంజీ మోటార్ అమ్మకాల గణాంకాలు చాలా దగ్గరగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇది టాటాను అధిగమించే అవకాశం ఉంది. జనవరిలో ప్రతి బ్రాండ్ ఎన్ని ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు చేసిందో చూద్దాం..

టాటా మోటార్స్ జనవరిలో 5,037 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. గత ఏడాది జనవరిలో అమ్ముడైన 5,790 ఈవీలతో పోలిస్తే ఈసారి టాటా మోటార్స్ అమ్మకాలు 13 శాతం తగ్గాయి. ఇది 2024 పూర్తి సంవత్సరంలో 61,435 కార్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది అంతకుముందుతో పోలిస్తే.. 2 శాతం పెరుగుదల.

ఎంజీ మోటార్ జనవరిలో 4,225 ఎలక్ట్రిక్ వ...