భారతదేశం, మార్చి 28 -- ఇండియాలో ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లోకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రాడక్ట్స్​ వచ్చి చేరుతున్నాయి. ఈ సెగ్మెంట్​లో హ్యుందాయ్​ క్రెటా ఎలక్ట్రిక్​ లేటెస్ట్​ ఎంట్రీగా ఉంది. ఈ హ్యుందాయ్​ క్రెట్ ఎలక్ట్రిక్​​.. మార్కెట్​లో గతేడాది ప్రవేశించిన టాటా కర్వ్​ ఈవీకి గట్టిపోటీని ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు ఎలక్ట్రిక్​ కార్లను పోల్చి, ఏది బెస్ట్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

టాటా కర్వ్ ఈవీ శ్రేణి 45 కిలోవాట్, 55 కిలోవాట్ల రెండు బ్యాటరీ ప్యాక్​లతో అందుబాటులో ఉంది. టాప్​లైన్ టాటా కర్వ్ ఈవీ ఎంపవర్డ్+ ఏలో 55 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది. పెద్ద బ్యాటరీ ప్యాక్ 585 కిలోమీటర్ల ఏఆర్ఏఐ సర్టిఫైడ్ రేంజ్​ని పొందుతుంది. అంతే కాదు, ఈ పెద్ద బ్యాటరీ మరింత శక్తివంతమైన 165 బీహెచ్​పీ ఎలక్ట్రిక్ మోటారును కూడా పొందుతుంది.

అదే విధంగా, హ్య...