భారతదేశం, ఏప్రిల్ 15 -- భారత్‌లో రోజురోజుకు ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఈవీలను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. ఇతర వేరియంట్లను ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తున్నాయి. మహీంద్రా కూడా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పుడు విడుదలకు ముందు మరోసారి మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఈవీ టెస్టింగ్ సమయంలో కనిపించింది. మహీంద్రా ఈవీ మార్కెట్లో టాటా నెక్సాన్ ఈవీ వంటి ఎస్‌యూవీలతో పోటీ పడుతుంది.

పరీక్ష సమయంలో లీకైన ఈవీ స్పై షాట్లు న్యూస్ వెబ్‌సైట్ రష్లేన్లో ప్రచురితమైంది. వార్తా నివేదిక ప్రకారం రాజ్కోట్-అహ్మదాబాద్ హైవేపై ఈవీ కనిపించింది. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలోని షీట్ మెటల్ ప్యానెల్స్, ప్లాస్టిక్ ట్రిమ్‌లు ఐసీఈ వంటివి ఉన్నాయి. ఎక్స్‌యూవీ 400 మాదిరిగానే ఎక్స్‌యూవీ 3ఎక్స...