భారతదేశం, ఫిబ్రవరి 2 -- ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ కార్స్​లో ఒకటి.. ఎంజీ జెడ్​ఎస్​ ఈవీ! ఇప్పుడు ఈ ఈవీ ధరను పెంచుతున్నట్టు జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్​ ప్రకటించింది. ఈ పెంపు, ఇప్పటికే అమల్లోకి వచ్చింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ.. వేరియంట్ ఆధారంగా రూ.89,000 వరకు పెరిగింది! ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​ ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..

ఇన్​పుట్​ కాస్ట్​ పేరుతో గత రెండు నెలలుగా దేశంలోని దాదాపు అన్ని ఆటోమొబైల్​ సంస్థలు తమ వాహనాల ధరలను పెంచుతున్నాయి. ఇందులో భాగంగానే జెడ్​ఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్​ కూడా ఇప్పుడు ఎంజీ జెడ్​ఎస్​ ఈవీ ధరలను పెంచేసింది.

ఎంజీ జెడ్ఎస్ ఈవీ టాప్-స్పెక్ ఎసెన్స్ డ్యూయెల్ టోన్ ఐకానిక్ ఐవరీ, ఎసెన్స్ డార్క్ గ్రే వేరియంట్లు అత్యధికంగా రూ.89,000 ధర పెరిగాయి. దీని తరువాత ఎక్స్​క్లూజివ్ ప్లస్ డార్క్ గ్రే వేరియ...