భారతదేశం, జనవరి 29 -- హర్యానాలోని 5 వేర్వేరు నగరాల్లో జేబీఎం ఆటో 100 శాతం ఎలక్ట్రిక్ బస్సు.. జేబీఎం ఎకోలైఫ్‌ను జెండా ఊపి ప్రారంభించింది ప్రభుత్వం. హర్యానా రాష్ట్రంలో నేషనల్ ఈ-బస్ స్కీమ్ కింద 375 ఎలక్ట్రిక్ బస్సుల సరఫరాకు కంపెనీకి ఆర్డర్ వచ్చింది. వీటినన్నింటినీ హర్యానాకు చెందిన ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ జేబీఎం ఆటో సరఫరా చేసింది. ఈ ఏడాది పబ్లిక్ మొబిలిటీ రంగంలో జేబీఎం ఆటో విజయవంతంగా దశాబ్దాన్ని పూర్తి చేసుకుంది. రాబోయే 3-4 సంవత్సరాలలో 20 బిలియన్లకు పైగా ప్రయాణీకులకు సేవలు అందించాలని, 3 బిలియన్ ఇ-కిలోమీటర్లు ప్రయాణించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఎకోలైఫ్ ఎలక్ట్రిక్ బస్సులు, జీరో ఎమిషన్ వెహికల్స్ (జేఈవీ) కొత్తగా ప్రారంభించిన జేబీఎంలు రాబోయే 10 సంవత్సరాలలో సుమారు 1,000 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలకు సమానమైనవి, 420,000 లీటర్ల డీ...