భారతదేశం, ఫిబ్రవరి 22 -- ఎలమంచిలి నుంచి విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం.. రోజూ వేలాది మంది విశాఖపట్నం, రాజమండ్రి, తునికి వెళ్తుంటారు. వీరిలో ఎక్కువ శాతం రైళ్ల పైనే ఆధారపడతారు. అయితే.. ఇటీవల రైల్వే శాఖ అధికారులు తీసుకున్న నిర్ణయాలతో ఇక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రైళ్లను రద్దు చేయడం పెద్ద సమస్యగా మారింది. అటు కొత్త ట్రైన్లకు ఎలమంచిలిలో హాల్టింగ్ లేదు. దీంతో బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ఫలితంగా భారం పెరుగుతోందని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.

ఈ ప్రాంతానికి చెందిన ప్రజలు నెలవారి పాసులు తీసుకొని తక్కువ ఖర్చుతో ప్రయాణం సాగిస్తుంటారు. ప్రస్తుతం రైళ్లు అందుబాటులో లేని కారణంగా.. బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో ఖర్చు ఎక్కువ అవుతోందని చెబుతున్నారు. ఏ రైలు ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని చెబుతున్నారు. కొత్త రైళ్...