భారతదేశం, మార్చి 30 -- Eid Ul Fitr 2025 : ముస్లింల పవిత్ర రంజాన్ మాసం ముగిసింది. శనివారం సాయంత్రం సౌదీ అరేబియాలో నెలవంక కనిపించింది. దీంతో మార్చి 30 ఆదివారం ఈద్-ఉల్-ఫితర్‌ను జరుపుకోవాలని నిర్ణయించారు. సాధారణంగా సౌదీ అరేబియా రంజాన్ ప్రకటించిన తర్వాత రోజు భారతదేశంలో ఈద్ జరుపుకుంటారు. అందువల్ల భారత్ మార్చి 31, సోమవారం ఈద్-ఉల్-ఫితర్ జరుపుకునే అవకాశం ఉంది.

ఈత్ ఉల్ ఫితర్ ను "ఉపవాసం విరమించే పండుగ" అని పిలుస్తారు. ఇది రంజాన్ ముగింపును సూచిస్తుంది. ఈ సమయంలో ముస్లింలు తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. ఈద్ ఉల్-ఫితర్ ను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.

ఇస్లాంలో అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటైన రంజాన్...ఈ ఏడాది మార్చి 2, ఆదివారం నాడు భారత్ లో ప్రారంభమైంది, మార్చి 1న నెలవంక కనిపించిన తర్వాత రంజాన్ నెల ...