Hyderabad, జనవరి 28 -- ఎవరైనా వంట గురించి ఆలోచిస్తే ముందుగా త్వరగా అయిపోయేది, రుచికరమైన దానికే ప్రాధాన్యత ఇస్తారు. అందులో టాప్ లో ఉండేది ఈ ఎగ్ బుర్జీ. ఉదయం ఆఫీసుకు ఆలస్యం కాకుండా, పిల్లలకు స్కూల్ బాక్సులకు ఇబ్బంది కాకుండా సరైన సమయానికి రెడీ చేసుకోగల వంటకం. దీని కోసం పెద్దగా ఇబ్బంది పడనవసరం లేదు. పైగా బాగా వంట తెలిసిన వాళ్లే చేయాలని కూడా లేదు. ప్రొటీన్ అధికంగా ఉండి శరీరానికి మంచి ఎనర్జీని అందించే ఈ వంటకాన్ని కాస్త నాలెడ్జ్ ఉన్న వాళ్లెవరైనా చేసేయొచ్చు.

అదేనండీ ఎగ్ బుర్జీ. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఎగ్ లేకుండా ఎగ్ బుర్జీని ఎలా తయారుచేయాలి అని. అదేంటో మీకు కూడా డౌట్ గానే ఉందా. రండి తెలుసుకుందాం. మాంసాహారం మానేసిన వాళ్లు కూడా ఈ ఎగ్ లెస్ ఎగ్ బుర్జీతో ప్రొటీన్లను సంపాదించుకోవచ్చు. దీని కోసం కావల్సిన ఆహార పదార్థాలు, తయారీ విధానం ఇలా ఉన్నాయ...