Hyderabad, జనవరి 29 -- ఉడకబెట్టిన గుడ్లు తినడం ఎంతోమందికి అలవాటు. గుడ్లను ఉడకబెట్టిన తర్వాత ఆ నీటిని సింక్‌లో పోసేస్తూ ఉంటారు. నిజానికి గుడ్లు ఉడకబెట్టిన నీరు ఎంతో శక్తివంతమైనది. గుడ్లలో పోషకాలు మాదిరిగానే గుడ్లు ఉడకబెట్టిన నీళ్లలో కూడా శక్తివంతమైన పోషకాలు ఉంటాయి. గుడ్డు పెంకులు, గుడ్డు తెల్లసొన నుండి కొన్ని పోషకాలు బయటికి వచ్చి నీటిలో కలిసిపోతాయి. ముఖ్యంగా కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, భాస్వరం, ఇనుము వంటివి ఇందులో ఉంటాయి. కాబట్టి గుడ్లు ఉడకబెట్టిన నీటిని పడేయకుండా తిరిగి వినియోగించవచ్చు.

గుడ్లు ఉడకబెట్టిన నీటిని చల్లార్చి ఇంట్లో ఉన్న మొక్కలకు వేయండి. మొక్కలకు సరైన స్థాయిలో పోషకాలు అందుతాయి. మొక్కలు ఎదగడానికి పొటాషియం అవసరం. గుడ్లు ఉడకబెట్టిన నీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది.

మీ మొక్కలకు సాధారణ నీళ్ళు పోసే కన్నా గుడ్ల ఉడకబెట్టిన నీళ్లు...