Hyderabad, మార్చి 31 -- కోడిగుడ్డు వంటకాలు ప్రతిరోజూ తింటే ఆరోగ్యానికి మంచిదే. ఇక్కడ మేము కోడిగుడ్డు షేర్వా రెసిపీ ఇచ్చాము. ఇది అన్నంలో కలుపుకుని తినేందుకు రోటి, చపాతీలతో తినేందుకు రుచిగా ఉంటుంది. అలాగే ఇడ్లీ, దోశలతో కూడా తినవచ్చు. ఎక్కువ మంది మటన్ షేర్వా తినడానికి ఇష్టపడతారు. నిజానికి ఎగ్ షేర్వా కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది తినాలన్న కోరికను పెంచుతుంది. రెసిపీ కూడా చాలా సులువు. కాబట్టి ఎగ్ షేర్వా ఎలా చేయాలో తెలుసుకోండి.

కోడిగుడ్లు - నాలుగు

కొత్తిమీర తరుగు - నాలుగు స్పూన్లు

లవంగాలు - నాలుగు

యాలకులు - మూడు

దాల్చిన చెక్క - చిన్న ముక్క

జీడిపప్పులు - గుప్పెడు

ఎండు కొబ్బరి పొడి - రెండు స్పూన్లు

ఉల్లిపాయలు - రెండు

పచ్చిమిర్చి - నాలుగు

సోంపు గింజలు - అర స్పూన్

నీళ్లు - తగినన్ని

పుదీనా - పావు కప్పు

కరివేపాకులు - గుప్పెడు

పసుప...