Hyderabad, ఏప్రిల్ 10 -- ఎగ్ బిర్యానీ, మటన్ బిర్యానీ వేరువేరుగా తిని ఉంటారు. కానీ ఎగ్ మటన్ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా? ఇది చాలా ప్రత్యేకమైన రుచితో ఉంటుంది. వివాహ వేడుకలప్పుడు ఇంటికి అతిధులు వచ్చినప్పుడు ఇలా ఎగ్ మటన్ బిర్యానీ వండి చూడండి. మీకు ఎంతో నచ్చుతుంది. పైగా దీన్ని వండడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మటన్ బిర్యానీ ఎలా చేస్తామో దాదాపు అలానే ఉంటుంది. రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

కోడిగుడ్లు - ఐదు

బాస్మతి బియ్యం - రెండు కప్పులు

అల్లం వెల్లుల్లి పేస్టు - మూడు స్పూన్లు

నెయ్యి - మూడు స్పూన్లు

పుదీనా ఆకులు - అరకప్పు

ఉప్పు - రుచికి సరిపడా

కారం - రెండు స్పూన్లు

ఉల్లిపాయలు - నాలుగు

లవంగాలు - ఐదు

షాజీరా - ఒక స్పూను

యాలకులు - నాలుగు

పచ్చిమిర్చి - ఐదు

జీడిపప్పు - పావు కప్పు

బిర్యానీ ఆకులు - రెండు

లవంగాలు - ఆరు

కొత్తిమీర తరుగు...